ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్న ప్రభాస్.. ఏమైందో తెలుసా..?

164
prabhass

రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇండియా వైడ్ గా ప్రభాస్ కు అభిమానులు పెరిగిపోయారు. ఇక సాహో సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ భారత సినీ చరిత్రలో ఏ హీరోకు దక్కని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా సెట్స్ మీద ఉంది. 

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్తంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లుక్ పరంగా కంటిన్యూటీ మిస్ కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభాస్ కి సూచించారని తెలసింది.  

అయితే గత కొంత కాలంగా ప్రభాస్ శరీరంలో ఇటీవల కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభాస్ ఫిట్ నెస్ కోల్పోయాడనే విషయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ప్రభాస్ యూకేలోని వరల్డ్ క్లాస్ డాక్టర్, డైటీషన్ వద్ద అత్యుత్తమ చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ప్రభాస్ సీక్రెట్ గా యూకే పయనమయ్యాడని వార్తలు వస్తున్నాయి.  

కాగా ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే పలువురు క్రేజీ స్టార్లతో ఈ సినిమాకు నేషనల్ క్రేజ్ వచ్చేసింది. 

  

Previous articleవామ్మో నోట్లో అంత బంగారం ఎలా పట్టిందిరా బాబు..!
Next articleగర్భిణీ భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన భర్త..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here