‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా యూనిట్ అభిమానులక సర్ ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో ప్రభాస్ పాత్రను పరిచయం చేసింది. విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ను కూడా విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టిను రోజు రానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ తో పాటు పాత్ర పేరున కూడా రివీల్ చేిసంది. 

ఈ లుక్ లో ప్రభాస్ కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ నవ్వుతూ కనబడుతున్నాడు. ఈ లుక్ ప్రభాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ఇటీవల పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను కూడా చిత్రం యూనిట్ విడుదల చేసింది. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ క్రిష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రభాస్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

Leave a Comment