మోడీని ప్రశ్నిస్తూ పోస్టర్లు.. 17 మంది అరెస్ట్..!

ప్రస్తుతం దేశంలో కరోనా సకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పెరగడానికి కారణం మోడీ ప్రభుత్వమే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మోడీ సర్కార్ మాత్రం కరోనా నుంచి బయటపడే మార్గాలు అన్వేషించే కన్నా విమర్శించే వారి నోల్లు మూయించడం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తుంది. 

కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం అలసత్వం చూపిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.. కాగా కరోనా నియంత్రణలో మోడీ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ఇటీవల పోస్టర్లు వెలిశాయి. దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

వీటికి సంబంధించి వివిధ చట్టాల కింద 21 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాలుగు డవిజన్లలో ఈ అరెస్టులు జరిగాయి. పోస్టర్లలో ఏముందంటే..‘మోడీజీ, అప్నే బచ్చోకి వ్యాక్సిన్ విదేశ్ కో క్యూ భేజ్ దియా’(మోడీ గారు మీరు మా పిల్లల వ్యాక్సిన్ విదేశాలకు ఎందుకు పంపించారు) అని ఓ పోస్టర్ లో ఉంది. ఈ పోస్టర్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తామని అని పోలీసులు తెలిపారు.  

 

Leave a Comment