నవంబర్ వరకు రేషన్ ఉచితం : మోడీ

దేశంలో అన్ లాక్ 1.0 కు ముందు కేసులు తక్కువగా ఉన్నాయని, తర్వాత కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అన్ లాక్ 1.0 తర్వాత ప్రజలలో వ్యక్తిగత నిర్లక్ష్యం బాగాపెరిగిందన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయడం లేదన్నారు. కరోనా కేసులు పెరగడానికి ఇది ముఖ్యకారణమన్నారు.  కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

రాబోయేది  పండుగల సీజన్ అని, ఈ సమయంలో పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదని అన్నారు. ఇందు కోసం నవంబర్ నెల వరకు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జులై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల ప్రజలకు ప్రతినెలా ఐదు కేజీల ఉచిత బియ్యం మరియు ఒక కేజీ దాల్ ఉచితంగా అందజేస్తామన్నారు.

ఇప్పుడు మనం అన్ లాక్ 2.0లో ప్రవేశించామని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం వాతావరణ మారిపోతుందని,  ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజలలో నిర్లక్ష్యం పెరినందున రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక దేశ ప్రధాని మాస్కు ధరించలేదని రూ.13 వేలు జరిమానా విధించారని, మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవరించాలని సూచించారు. 

 

 

 

Leave a Comment