‘రాజకీయం నా నుంచి దూరం కాలేదు’.. హాట్ టాపిక్ గా చిరంజీవి ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి ట్విట్టర్ లో ఓ ఆడియో క్లిప్ ని షేర్ చేశారు. అందులో ‘రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అని తన వాయిస్ ఓవర్ తో ఉన్న ఆడియో క్లిప్ ని మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పరంగా ఆసక్తిని పెంచుతుంది.. ఈ డైలాగ్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’లో వాడి ఉంటారని అందరూ భావిస్తున్నారు.. 

ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అది రాజకీయ నేపథ్యం ఉన్న మూవీ.. ఆ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. నేరుగా రాజకీయాల్లో ఉండరు. కానీ రాజకీయాలను కనుసైగతో శాసిస్తారు. కానీ బయట మాత్రం చాలా సాదాసీదాగా ఉంటారు. అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి.. ఈ డైలాగ్ అందులో పెట్టి ఉంటారు అని అందరూ భావిస్తున్నారు. 

అయితే ప్రస్తుతం ఈ డైలాగ్ పై చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ డైలాగ్ షేర్ చేయడం వెనక ఆంతర్యం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. రాజకీయంగానే ఈ కామెంట్లు చేశారా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చాలా సార్లు చెప్పారు. అయితే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం సొంత పార్టీ పెట్టి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ కే మద్దతు ఇస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

 

Leave a Comment