‘ఛలో ఢిల్లీ’.. పోలీస్ దాహం తీర్చిన రైతు.. వీడియో వైరల్..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అయితే ఈ కార్యక్రమం పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, నీటి ఫిరంగులను ప్రయోగించారు.  

పోలీసులు వారిని చెదరగొడుతున్నప్పటికీ ఓ రైతు తన మానవత్వాన్ని ప్రదర్శించాడు. దాహంతో ఉన్న ఓ పోలీస్ కు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డ్యూటీలో భాగంగా రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై చల్లని నీళ్లు చల్లారు. కానీ మనకు ఉన్న దాన్ని పక్కనున్న వారికి పంచుకోవడమే మన విధి అని గురువు చెప్పిన మాటలను రైతులు పాటించారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ రైతుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Leave a Comment