పవన్ కళ్యాణ్ పాటపై పోలీసుల అభ్యంతరం.. కారణం ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా భీమ్లా నాయక్.. ఈ సినిమా టైటిల్ సాంగ్ పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైంది.. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో ఈ పాట దూసుకుపోతోంది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈపాటను ఇద్దరు గాయకులు పాడారు. జానపద గాయకుడు, కిన్నెరమెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, మరో సింగర్ రామ్ మిరియాల ఈ పాటకు గానం అందించారు..

అయితే ఈ పాటకు అనూహ్యంగా వివాదాలు చుట్టు ముట్టాయి.. ఈ పాటలోని కొన్ని పదాలను తెలంగాణ పోలీసులు అభ్యంతరం తెలిపారు. పాట లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రీ పోలీసులను కించపరిచేలా పదాలు రాశారని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ తన ట్విట్టర్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘తెలంగాణ కాప్స్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు. ప్రజల రక్షణ కోసం తాము జీతాలు తీసుకుంటున్నాము. అలాంటి వారి ఎముకల్ని తాము విరగ్గొట్టం. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీకి పోలీసుల సేవల గురించి వర్ణించేందుకు ఇంతకు మించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరం. పోలీసుల సేవల గురించి ఇందులో ఎక్కడా పేర్కొనలేదు’ అంటూ డీసీపీ రమేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

Leave a Comment