చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం..!

132
saidabad

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులు నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈక్రమంలో చిన్నారి హత్యాచారం కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. 

ఈనేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని పేర్కొన్నారు. నిందితుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని ప్రకటించారు. అతడి రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.   

Previous articleసాయి ధరమ్ తేజ్ గురించి చూపిస్తారు.. చిన్నారి గురించి చూపించరా.. అంటూ మీడియాపై మంచు మనోజ్ ఫైర్..!
Next articleయూపీలో డెంగ్యూతో అల్లాడుతున్న ప్రజలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here