శభాష్ పోలీస్ : నిండు ప్రాణాన్ని నిలిపాడు..!

15
Constable Khaleel

ఓ కానిస్టేబుల్ సమయ స్ఫూర్తితో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో వెళ్లిన యువకుడికి ఊపిరి పోశాడు. కరీనంగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద బొమ్మకల్ కు చెందిన ఎండీ అబ్దుల్ ఖాన్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢి కొట్టింది. దీంతో అబ్దుల్ ఖాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడి హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది. 

అక్కడే విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ కానిస్టేబుల్ ఎం.ఏ ఖలీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ప్రథమ చికిత్సలో భాగంగా యువకుడి గుండెపై నిమిషం పాటు ప్రెసింగ్ చేశాడు. అలా చేయడంతో యువకుడిలో హార్ట్ బీట్ మొదలైంది. వెంటనే ఆ యువకుడిని 108లో ఆస్పత్రికి తరలించారు.

 కానిస్టేబుల్ ఖలీల్ చూపించిన సమయస్ఫూర్తికి సీపీ కమలాసన్ రెడ్డితో పాటు పలువురు అభినందించారు. ఖలీల్ చేసిన పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దీంతో శభాష్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

Previous articleఆర్థిక నేరగాళ్ల విలువైన ఆస్తులు స్వాధీనం..!
Next articleజగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు వార్నింగ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here