మహిళను తన భుజాలపై మోసుకెళ్లిన పోలీస్..వీడియో వైరల్..!

మధ్యప్రదేశ్ లో పోలీస్ అధికారులు మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడ్డ గాయపడ్డ వారిని తమ భుజాల మీద మోసుకుని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 35 మందితో వెళ్తున్న ఓ మినిట్రక్కు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. 

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు అక్కడ స్ట్రెచర్లు అందుబాటులోలేవు. దీంతో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ సంతోష్ సేన్, ఎల్ ఆర్ పటేల్, కానిస్టేబుళ్లు అశోక్, రాజేష్, అంకిత్ లు స్థానికుల సహయాంతో గాయపడిన వారిని తమ భూజాల మీద మోసుకెళ్లారు. 

వీరిలో సంతోష్ సేన్ ఒక పెద్దావిడను తన వీపు మీద మోసుకెళ్లి ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలోకి వెళ్లాక మరో పోలీస్ ఆ అధికారికి సహాయం చేశాడు.  అయితే విశేషం ఏంటంటే 14 ఏళ్ల క్రితం పరారీలో ఉన్న ఓ క్రిమినల్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో సంతోష్ సే్ కుడి భుజానికి బెల్లట్ తగిలింది. అప్పటి నుంచి ఆయన కుడి చేయి సరిగా పని చేయదు. అయినా దానిని పట్టించుకోకుండా ఆ అధికారి మహిళను తన వీపు మీద మోసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో సంతోష్ సేన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శిరాజ్ సింగ్ చౌహాన్ కూడా సేన్ ను ప్రశంసించారు. 

Leave a Comment