యువకుడి మృతి కేసులో కోడి అరెస్ట్.. !

జగిత్యాల జిల్లాలో ఇటీవల కోడి కత్తి మర్మాంగాలకు తగిలి యువకుడు మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి మరణానికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఏం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్ కు చెందిన తనుగుల సతీష్ తొత్తనూరులో జరిగిన కోడి పందేల్లో స్నేహితులతో కలిసి సరదాగా పాల్గొన్నాడు.

ఈక్రమంలో తన కోడి కాలుకు కత్తి కట్టాడు. కోడిన తన కాళ్ల కింద పట్టుకుని కూర్చున్నాడు. ఆ సమయంలో కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో కోడి కాలుకు ఉన్న కత్తి సతీష్ మర్మాంగాలకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన సతీష్ మృతి చెందాడు. 

ఈ కేసులో కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ మరణానికి కారణమైన కోడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. దానిని లాకప్ లో కట్టేశారు.  కాసేపు సెల్ లో, మరికాసేపు చెట్టు కిందకు మార్చేస్తున్నారు. త్వరలో కోడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అప్పటి వరకు కోడిని కంటికి రెప్పలా చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. 

 

Leave a Comment