ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని

ఢిల్లీలో జరుగుతున్న హింసపై ప్రధాని మోడీ తొలిసారిగా స్పందించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాలను సంయమనంతో అన్ని సమయాల్లో కొనసాగించాలని అభ్యర్థిస్తూ ప్రధాని మోడీ ట్విట్ చేశారు. ఢిల్లీలో సత్వరమే శాంతి, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.  కాగా ఢిల్లీలో సీఏఏపై అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. బుధవారం మృతులసంఖ్య 20కి చేరింది. వందల మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. అల్లర్లను తక్షణమే నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీగా పోలీసులను మోహరించింది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ హింస ఆగడం లేదు. రాళ్ల దాడితో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. బుధవారం చెలరేగిన హింసలో ఓ నిఘా అధికారి కూడా మరణించడం కలకలం రేపుతోంది. 

Leave a Comment