ఇక ఇలాంటి ఆధార్ కార్డులు చెల్లవట..UIDAI కీలక ప్రకటన..!

ఆధార్ కార్డుల విషయంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. బయటి మార్కెట్ నుంచి తీసుకున్న పీవీసీ ఆధార్ కార్డు ఉపయోగించడం మంచిది కాదని చెప్పింది. సెక్యురిటీ లేకపోవడం వల్ల బయటి మార్కెట్ లో లభించే పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ కార్డులు ఎలాంటి సెక్యురిటీ లేదా సెక్యురిటీ ఫీచర్లను కలిగి ఉండవని, కాబట్టి ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డును తీసుకోకండని తెలిపింది. పీవీసీ ఆధార్ కార్డు కోసం యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని రూ.50 చెల్లిస్తే పోస్టులో పంపిస్తామని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

పీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయడం ఎలా?

  • ముందుగా UIDAI వెబ్ సైట్ https://myaadhaar.uidai.gov.in/ ని ఓపెన్ చేయండి.
  • తర్వాత అందులో లాగిన్ పై క్లిక్ చేసిన లాగిన్ అవ్వండి.
  • అక్కడ ‘ఆర్డర్ ది పీవీసీ కార్డ్’ పైన క్లిక్ చేయండి. 
  • అక్కడ మీ వివరాలు ఉంటాయి. 
  • తర్వాత నెక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.. 
  • ఆ తర్వాత రూ.50 చెల్లించాలి. 
  • అంతే ఆధార్ కార్డులో అడ్రెస్ కి పీవీసీ కార్డు పోస్టులో వస్తుంది. 

బయట ఆధార్ భద్రతకు ప్రమాదం:

బహిరంగ మార్కెట్ లో ఆధార్ కార్డులను తీసుకున్నట్లయితే మీ సమాచారం లీక్ కావచ్చు. ఇంటర్నెట్ షాప్ లో ప్లాస్టిక్ కార్డును తయారు చేయడానికి షాప్ యజమాని మీ ఆధార్ పీడీఎఫ్ కాపీని సిస్టమ్ లో సేవ్ చేస్తాడు. ఆ తర్వాత దానిని ప్రింట్ ఇచ్చి ప్లాస్టిక్ కార్డులు తయారు చేస్తాడు. అలా ఇతరుల కంప్యూటర్ లో ఆధార్ కాపీ సేవ్ చేసి ఉండటం అనేది ఆధార్ భద్రతకు ప్రమాదం. అందుకే ఇలాంటి వాటిని నివారించేందుకు యూఐడీఏఐ నిషేధం విధించింది. 

 

Leave a Comment