మారువేషంలో నిందితుడి ఫొటోలు.. షేర్ చేయండి..!

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని రాజు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. రాజు చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. అనంతరం శవాన్ని గదిలో ఉంచి తాళం వేసి బయటకు వెళ్లాడు. చిన్నారి కోసం తల్లిదండ్రులు స్థానికులు, పోలీసులు గాలిస్తున్న సమయంలో రాజును పారిపోవాలంటూ తన స్నేహితుడు సూచించినట్లు దర్యాప్తులో తేలింది. 

రాజును  గుర్తపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, టవల్, ఒకజత బట్టలతో ఒక సంచిని కూడా ఇచ్చాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆరోపణలకు బలం చేకూర్చుతూ సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే నిందితుడి ఆచూకీ మాత్రం ఇంత వరకు దొరకలేదు. నిందితుడి వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో అతడు ఎటు వెళ్లింది గుర్తపట్టడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. 

నిందితుడు పల్లకొండ రాజు ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. నిందితుడి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఎత్తు సమారు 5.9 అడుగులు ఉంటుంది. జుట్టు దేవుని మొక్కు కోసం పెంచబడి పిలక రబ్బర్ బ్యాండ్ తో ముడి వేయబడి ఉంటుంది. అతని మెడలో ఎర్రనీ కండవ, క్యాప్ ధరించి ఉంటాడు. అతని రెండు చేతుల మీద మౌనిక అని టాటూ మార్క చేయబడి ఉంటుంది. అతనికి గడ్డం గవద వద్ద మాత్రమే ఉంటుంది. ఆచూకీ తెలిసిన వారు 9490616366, 9490616627 నెంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు వెల్లడించారు.  

అయితే ఎవరు గుర్తపట్టకుండా ఉండటానికి నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ పోలీసులు నిందితుడికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను విడుదల చేవారు. జుత్తు, గడ్డం లాంటి మార్పులతో నిందితుడిని పోలి ఉండే చిత్రాలను రిలీజ్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. నిందితుడు దొరికేంత వరకు వీటిని షేర్ చేయాలని కోరారు. 

Leave a Comment