పెట్రోల్ ధరలు తగ్గించడం కుదరదు : కేంద్ర మంత్రి

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో పెట్రోలియ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం కుదరదని, ప్రజలకు ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయం తగ్గే సూచనలేే కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

 ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంపై చేయాల్సిన ఖర్చు పెరిగిపోతోందని, దీంతో పాటు సంక్షేమ రంగంపై కూడా ఖర్చులు పెరిగిపోయాయని చెప్పారు. ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు పెరిగిపోవడంతో పెట్రో ధరలు తగ్గించడం కుదరదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రో ఉత్పత్తుల ధర బ్యారెల్ 70 డాలర్లకు చేరిందని, అందకే దేశంలో ధరలు పెరిగాయని వెల్లడించారు.  

Leave a Comment