ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్..!

  • ఈనెలలోనే రూ.3 పెంపు
  • ఏడాదిలో లీటర్ పై రూ.25 పెరిగింది..

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే సెంచరీ దాటేశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఆదివారం పెట్రోల్ పై లీటర్ కు 17 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది..దీంతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ.100.30కు చేరింది. జిల్లాలోని చిత్తూరు, ఐరాల, కుప్పం ప్రాంతాల్లోనూ లీటర్ ధర 100 దాటేసింది..

ఇక మిగిలిన జిల్లాల్లో వందకు దాదాపు దగ్గర్లో ఉంది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ లీటర్ ధర వంద రూపాయలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇక తాజా పెంపుతో పెట్రోల ధరలు ఇలా ఉన్నాయ..

  • విజయవాడ – లీటర్ పెట్రోల్ ధర రూ.99.41
  •  అనంతపురం – రూ.99.43
  • ఏలూరు – రూ.99.64
  • గుంటూరు – రూ.99.39
  • కడప – 98.43
  • కాకినాడ – 99.57
  • కర్నూలు – రూ.99.71
  • మచిలీపట్నం – రూ.99.63
  • నెల్లూరు – రూ. 99.71
  • ఒంగోలు – రూ.98.51
  • శ్రీకాకుళం – రూ.99.15
  • విశాఖపట్నం – రూ.98.19
  • విజయనగరం – రూ.98.71

అలాగే రాష్ట్రంలో డీజిల్ ధర కూడా రూ.94కు చేరింది. ఈనెల 1న పెట్రోల్ ధర రూ.96.5, డీజిల్ రూ.90 ఉండగా, ఈ ఒక్క నెలలోనే లీటర్ పై దాదాపు రూ.3 పెరిగింది. అలాగే, గతేడాది మే నెలలో లీటర్ పెట్రోల్ రూ.74.50, డీజిల్ రూ.68.43 ఉండగా, ఏడాదిలోనే రూ.25 పెరగడం గమనార్హం.. 

Leave a Comment