పెట్రోల్, డీజిల్ ధరలు.. రూ.15 నుంచి రూ.22 వరకు పెరగొచ్చు?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? ఎంత వరకు పెరగొచ్చు? అనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. నేటితో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పెరగడానికి కారణాలేంటీ?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు దరలు కొండెక్కి కూర్చున్నాయి. భారత్ లో ప్రామాణికంగా భావించే బ్రెంట్ క్రూడ్ బ్యారెట్ ధర ప్రస్తుతం 129 డాలర్లు ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో రష్యా ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో రష్యాను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు అన్ని మార్టాలను వాడుకోవాలని అమెరికా సహా ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. 

అందులో భాగంగా రష్యా చమురు ఎగుమతులపైనా ఆంక్షలు అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇదే జరిగితే ప్రపంచ చమురు అవసరాల్లో 10 శాతం వాటా ఉన్న రష్యా నుంచి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. గతంలో అణ్వాయుధాల తయారీ నెపంతో ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను అమెరికా ఎత్తేయాలని యోచిస్తోంది. అయితే ఆ చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో పెట్రోల్ దిగుమతిలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా ఓపెక్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఉన్న పళంగా డిమాండ్ పెరగనుంది. డిమాండ్ కి తగ్గట్లుగా అధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసేందుకు ఒపెక్ దేశాలు సుముఖంగా లేవు. 

డిమాండ్ కి తగ్గస్థాయిలో చమురు లభ్యత తగ్గిపోవడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే.. దేశంలో అంతర్జాతీయ ధరలకు తగ్గట్లు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే విధానం అమల్లో ఉంది.

ఎంత పెరుగుతుంది? 

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటితో ఎన్నికలు ముగియనుండటంతో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి అంతర్జాతీయ ముడి చమురు ధరలకు తగ్గట్లు దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 నుంచి రూ.22 వరకు పెరగవచ్చని విశ్లే షకులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు ఒకేసారి ఈస్థాయిలో పెంచితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. దీంతో దశల వారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

Leave a Comment