ఏపీలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు : డీజీపీ

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తిరిగేందుకు వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తిరగాలన్నా..అనుమతి తప్పనిసరి ఉండేది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ 4 లో ప్రజా రవాణాకు అనమతులు ఇచ్చారు. రాష్ట్రంలో తిరిగే వ్యక్తిగత వాహనాలకు కూడా రాష్ట్ర పోలీస్ శాఖ సడలింపులు ఇచ్చింది. 

రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీజీపీ సవాంగ్ చెప్పారు. కార్లలో ముగ్గురికి మించకుండా ప్రయాణించాలన్నారు. అయితే మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

 

Leave a Comment