‘మోడీని చూసి ప్రజలు ఓట్లు వేయరు’

2022 ఎన్నికల్లో ప్రజలు మోడీని చూసి ఓట్లు వేయరని, ఎమ్మెల్యేలు పని చేస్తేనే వేస్తారని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్ సిందార్ భగత్ తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇది వరకే మోడీ ముఖం చూసి ఓట్లు వేశారని, వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. 

మోడీ పేరుతో ఎన్నికల్లో విజయం సాధించాలనుకోవడం వేస్ట్ అని, రానున్న ఎన్నికల్లో నేతల వ్యక్తిగత పనితీరు ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. బన్ సిందార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో స్పందించింది. మోడీ హవా తగ్గిందని ఒప్పుకుంటున్నందుకు స్వాగతిస్తున్నామని తెలిపింది. మోడీ హవా తగ్గడంతోనే ఆయన తన ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ప్రదర్శన మెరుగుపరచుకోవాలని సూచించారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ ధస్మానా చెప్పారు.  

 

Leave a Comment