యూపీలో డెంగ్యూతో అల్లాడుతున్న ప్రజలు..!

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో డెంగ్యూ జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా చిన్ని పిల్లలపై ఈ జ్వరాల ప్రభావం అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 వేల మంది డెంగ్యూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఉన్నట్టుండి పిల్లలు చనిపోతున్నారు కూడా. ఇప్పటివరకు ఫిరోజాబాద్ లో 60 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆ సంఖ్య 100కు పైగానే ఉన్నట్లు చెబుతున్నాయి. 

అయితే అక్కడి ఆస్పత్రుల వద్ద దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ  11 ఏళ్ల బాలికను డెంగ్యూ జ్వరం రావడంతో ఆస్పత్రి చేర్చారు. ఆ సమయంలో అక్కడికి ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా తనికీల నిమిత్తం వచ్చారు. ఆ బాలిక సోదరి ఆయన కారుకు అడ్డపుడింది.. సార్ ఎలాగైనా నా చెల్లికి చికిత్స అందించండి. లేకుండా ఆమె చనిపోతుంది అంటూ వేడుకుంది. అయితే కొన్ని గంటల్లోనే ఆ బాలిక కన్నుమూసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది జరిగిన కొద్ది సేపటికే ఓ తండ్రి తన ఆరేళ్ల కూతురిని చేతులపై ఎత్తుకుని ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికి ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అయితే కొద్ది సేపటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం.. 

మరో ఐదేళ్ల బాలుడుకు డెంగ్యూ జ్వరం రావడంతో అతడి తండ్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స కోసం 30 వేల రూపాయలు అడ్వాన్సు కట్టాలని చెప్పారు. అయితే అతడు ఓ రోజు కూలి కావడంతో తన వద్ద అంత డబ్బు లేదని, తర్వాత కడతానని, చికిత్స చేయాలని ప్రాధేయపడ్డాడు. కానీ వారు దానికి ఒప్పుకోలేదు. దీంతో ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ బెడ్లు లేవు. దీంతో ఓ టాక్సీలో ఆగ్రా బయల్దేరాదు. కానీ మధ్యలోనే ఆ బాలుడు చనిపోయాడు. దీంతో ఆ తండ్రి విలవిల ఏడ్చాడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు చాలట్లేదని. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ఆస్పత్రుల వద్ద దృశ్యాలు అక్కడి వారిని కలచివేస్తున్నాయి.   

Leave a Comment