బంగారం, వెండి నాణేల కోసం ఎగబడ్డ జనం..!

నదిలో బంగారం, వెండి నాణేలు లభిస్తున్నాయన్ వార్త కోడై కూసింది. ఇక అంతే క్షణాల్లో జనాలు వాలిపోయారు. నాణేల కోసం నదిలో గాలింపు చేపట్టారు. అక్కడక్కడ తవ్వకాలు కూడా జరిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఎనిమిది రోజుల క్రితం కొంత మంది మత్స్యాకారులకు రాజ్ ఘర్ జిల్లాలోని పార్వతి నదిలో బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయి. 

ఈ వార్త స్థానికంగా ఉండే అందరి చెవుల్లో పడిపోయింది. దీంతో రాజ్ ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్ పూరా గ్రామస్థులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకుని నాణేల కోసం వేట ప్రారంభించారు. నీళ్లలోకి దిగి బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం వెతికారు. నాణేల కోసం వెతుకులాట గత ఐదురోజులుగా కొనసాగుతోంది. అయితే ఈ వార్తలను పోలీసులు కొట్టిపడేస్తున్నారు. ఇంత వరకు ఎవరికీ నాణేలు దొరకలేదని స్పష్టం చేశారు.   

 

Leave a Comment