ప్రజలు అధిక ధరలకు అలవాటు పడ్డారు : బీజేపీ నేత

దేశంలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజానీకానికి షాకిస్తున్నాయి. వాహనాలు బయటకు తీయాలంటేనే జాంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సంచరీ దాటింది. మండిపోతున్న పెట్రోల్ ధరలపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

ఈక్రమంలో బీహార్ కు చెందిన బీజేపీ నేత, మంత్రి నారాయణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. సామాన్యులు ఎక్కువగా బస్సుల్లో వెళ్తారని, కొద్ది మంది మాత్రమే ప్రైవేట్ రవాణాను ఉపయోగిస్తున్నారని తెలిపారు.ప్రజలు అధిక ధరలకు అలవాటుపడ్డారని అన్నారు. ధరల పెరుగుదల తనను కూడా ప్రభావం చేస్తోందన్నారు. ప్రజలు అలవాటు చేసుకుంటారని చెప్పారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.