కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు గత కొంతకాంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు..
దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఇద్దరిని మందలించారు. కులాలు వేరుకావడంతో పెళ్లి చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన శివ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రియుడి మరణవార్త తెలుసుకున్న సుస్మిత గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.