10 వేల జీతమని.. పిల్లను కూడా ఇవ్వలేదు.. నేడు బిలియనీర్ స్థాయికి..!

డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎంకి ఎంతటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఫోన్ రీఛార్జ్, కరెంట్ బిల్లులు, ట్యాక్స్ లు ఇలా అనేక ఆర్థిక లావాదేవీలు పేటీఎం ద్వారా సులువుగా చేసుకోవచ్చు. అనతి కాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరించింది. తాజాగా భారత్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో స్థాయికి ఎదిగింది. అయితే ఈ పేటీఎంని స్థాపించింది మాత్రం ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి  విజయ్ శేఖర్ శర్మ.

పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ(43) ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కి చెందిన ఓ సాధారణ కటుంబం నుంచి వచ్చారు. 2000 సంవత్సరంలో వన్ 97 అనే ఒక చిన్న కంపెనీని స్థాపించి టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించేవారు. అప్పుడు సంస్థ నుంచి ఆయనకు రూ.10 వేలు మాత్రం ఆదాయం వచ్చేది. దీంతో ఆయనకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల నుంచి విజయ్ శేఖర్ శర్మ రూ.18 వేల కోట్ల ఐపీవోతో భారత్ స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టి చరిత్రం సృష్టించారు.

ఆయన స్థాపించిన వన్ 97 2010లో పేటీఎంగా మారింది.. తర్వాత ఆన్ లైన్ పేమెంట్స్ లోకి అడుగుపెట్టారు. 2014లో వాలెట్ పేమెంట్స్ లైసెన్స్ పొందింది పేటీఎం.. 2015లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్ పేటీఎంలో తొలిసారిగా పెట్టబడులు పెట్టడంతో కంపెనీ గతిని మార్చేసింది. తర్వాత కొంతకాలంలో దేశం నలుమూలలా విస్తరించింది. 2017లో యువ బిలియనీర్స్ జాబితాలో విజయ్ శేఖర్ స్థానం సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.18 వేల కోట్లు ఉంది. దీన్ని బట్టి మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.. ఎవరి జీవితం ఎలా మారుతుందో ఊహించడం చాలా కష్టం.. రూ.10 వేల జీతం ఉందని ఆయనకు పిల్లనివ్వలేదు.. ఇప్పుడు ఆయన కోటీశ్వురుల జాబితాలో చేరారు. దీనిపై మీరెంటారు ఫ్రెండ్స్..  

Leave a Comment