పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ ఫస్ట్‌ లుక్‌ కిరాక్..

పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌తో పవర్‌ స్టార్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్‌ను వకీల్ సాబ్‌గా ఖరారు చేయగా.. ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. టైటిల్‌ని ధృవీకరిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ.. కుర్చీలో కూర్చోని ఉండటం’ ఫస్ట్ లుక్‌లో కనబడుతోంది. కాగా.. ఇది పవన్‌ కల్యాణ్‌ నటించిన 26వ చిత్రం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

 

Leave a Comment