పవన్ కళ్యాణ్ షూస్ ధర రూ.10 లక్షలా? నిజమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన ఏం చేసినా.. ఏం ధరించినా.. అది వార్తే.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యూత్ లో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది.. భీమ్లా నాయక్ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ కి వచ్చారు. రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్ తో అదిరిపోయే లుక్ లో కనిపించారు.. 

ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో ఆయన వేసుకున్న షూస్ చర్చనీయాంశంగా మారాయి. ఈ షూస్ ధర రూ.10 లక్షలు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరికొందరు అయితే.. ఈ షూ ఏ కంపెనీవి? ఎక్కడ దొరుకుతాయి? అనే వివరాలు కూడా పెడుతున్నారు. ఆన్ లైన్ లో ఈ షూస్ కొనాలనుకునే వారికి లింక్స్ కూడా పెడుతున్నారు. 

ఈ వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ Copenhagen కంపెనీకి చెందినవి. అయితే ఈ షూ ధర విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అఫీషియల్ సైట్ లో ఈ షూస్ ధర 119,94 యూరోస్ గా ఉంది. అయితే డచ్చ లాంగ్వేేజ్ లో పుల్ స్టాప్ ని, కామాగా రాస్తారు.. అందుకే అందరూ ఈ షూ ధర రూ.10 లక్షలు అని ఫిక్స్ అయ్యారు. కానీ దీని అసలు ధర 119.94 యూరోలు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.9,600 అన్న మాట.. 

Leave a Comment