అలీ బంధువుల ఫంక్షన్ కు హాజరైన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కామెడీ కింగ్ అలీ మంచి స్నేహితులు.. పవన్ ప్రతి సినిమాలో అలీ ఉండేవాడు. చాలా ఫంక్షన్లలో పవన్ పక్కన అలీ కనిపించేవాడు. సినిమాల్లో రాక ముందు నుంచి అలీకి మంచి స్నేహం ఉంది. అయితే ఎంత మంచి స్నేహితుల మధ్య అయినా అప్పుడప్పుడు మనస్పర్థలు రావడం సహజం..

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్, అలీ మధ్య రాజకీయ పరమైన విభేదాలు వచ్చాయి. జనసేన కాకుండా అలీ మరో పార్టీలో చేరడంతో అప్పట్లో పవన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్లపై అలీ కూడా సీరియస్ గానే స్పందించాడు. దీంతో కొద్ది కాలం ఒకరికొకరు దూరమయ్యారు.  

అయితే చాలా రోజుల తర్వాత పవన్, అలీ ఓ పెళ్లిలో కలిశారు. అలీ తమ్ముడు ఖయ్యూమ్ బావ పెళ్లి రిసెప్షన్ వేడుకకు పవన్ హాజరయ్యారు. అలీ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో ఇద్దరు కలిసి నవ్వుతూ పోజులిచ్చారు. కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. 

 

View this post on Instagram

 

A post shared by Zubeda Ali (@zubedaspage)

You might also like
Leave A Reply

Your email address will not be published.