కరోనా టెస్టులు చేసుకోమంటే.. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు పెట్టిన ప్రయాణికులు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే భయంతో ముంబాయి, పుణే, ఢిల్లీల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి బీహార్ రాష్ట్రానికి వచ్చే స్థానికులకు రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షలు చేయాలని సీఎం నితీష్ కుమార్ ఇటీవల ప్రకటించారు. 

పెద్ద సంఖ్యలో వలస కార్మికులు బీహార్ కు చేరుకుంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బీహార్ లోని బక్సార్ రైల్వే స్టేషన్ లో అధికారులు స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రయాణికులను ఆపుతుంటే వాగ్వాదానికి దిగుతున్నారు. కరోనా టెస్టుల నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి పరుగుతులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Leave a Comment