భార్యల మార్పిడి బాగోతం.. గుట్టురట్టు చేసిన పోలీసులు..!

లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి కొందరు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. ఒకడి భార్యను మరొకరు లైంగికంగా అనుభవించేందుకు పెద్ద నెట్ వర్క్ క్రియేట్ చేశారు. ఇందులో ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 జంటలతో పెద్ద ఇల్లీగల్ నెట్ వర్క్ ఏర్పాటు చేశారు. తాజాగా భార్యల మార్పిడి రాకెట్ లో ఏడుగురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతరు పురుషులతో సెక్స్ చేయాలని బలవంతం చేస్తున్న భర్తపై ఓ మహిళ కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గుట్టుచప్పుడుగా జరుగుతున్న ఈ బాగోతం బట్టబయలైంది.

భార్యలను మార్పిడి చేసుకుంటున్న వారు టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులు క్రియేట్ చేసుకొని అఫైర్ పెట్టుకుంటున్నారు. గ్రూపులో డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారు. భర్తకు తెలిసే భార్య మరొకరి భర్తతో.. భార్యకు తెలిసే భర్త మరొకరి భార్యతో పనికానిచ్చేస్తారు. తెల్లరాక ఎవరి దారిని వారు వెళ్లిపోతారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నారు. 

ఓ మహిళ ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ లో చాలా మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ వ్యవహారంలో భాగమని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి బాగోతంపై 25 మంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో మరింత మందిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.    

 

 

 

Leave a Comment