ఏడు తరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. గిఫ్ట్ గా చంద్రుడిపై ఎకరం భూమి కొన్నారు..!

దాదాపు ఏడు తరాల తర్వాత ఆడపిల్ల పట్టడంతో.. ఆమె జన్మదినాన్ని వినూత్నంగా నిరహించారు. తమ కూతురికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చారు. కూతురు 10వ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొని బహుమతిగా ఇచ్చాారు. ఈ ఘటన బీహార్ లోని మధుబని జిల్లాలో చోటుచేసుకుంద. 

బీహార్ లోని ఝుంఝూర్ పూర్ లో డాక్టర్ సుర్విందర్ ఝూ, డాక్టర్ సుధా ఝూ ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. వీరికి ఆస్తా భరద్వాజ్ అనే కూతురు ఉంది. దాదాపు ఏడుతరాల తర్వాత వీరి కుటుంబంలో పుట్టిన మొదటి కుమార్తె ఆస్తా.. ఇన్నేళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడంతో వారి కుటుంబంలో సంతోషానికి హద్దులులేకుండా పోయింది. 

ఈ ఆనందాన్ని గుర్తిండిపోయేలా చేయాలనుకున్నారు ఆ దంపతులు.. తమ కూతురు పదో పుట్టిన రోజుకు చంద్రునిపై ఎకరం భూమిని కొని గిఫ్ట్ గా ఇచ్చారు. చంద్రమండలంపై భూమిని కొని, రిజిస్టర్ చేయడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టిందని ఆ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. యూస్ఏలోని కాలిఫోర్నియా లూనా సొసైటీ వెబ్ సైట్ కి అన్ని రకాల పేపర్ వర్క్ లను సమర్పించి, అక్కడి ల్యాండ్ ధరలు తెలుసుకొని.. పేపల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని చెల్లించాక ఈ ఏడాది జనవరి 27న దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని చంద్రుడిపై భూమిని కొనుగోలు చేశారు.  

 

Leave a Comment