పారాసెటమాల్ తో వీర్య కణాలు తగ్గుతున్నాయట..!

ఇటీవల కాలంలో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మారిన జీవన శైలి, ఆహార పదార్థాల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోంది. గత 40 ఏళ్లలో మగవారిలో సగటు స్పెర్మ్ కౌంట్ సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోయిందని అధ్యయనాలు వెల్లడించాయి. ఓ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

రసాయన కాలుష్యం మగవారిలో వీర్యకణాల సంఖ్యను విపరీతంగా తగ్గిస్తాయట.. బిస్ఫినాల్, డయాక్సిన్, థాలోస్ వంటి రసాయనాలు స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. లండన్ లోని బ్రూనెల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం ప్యాకేజ్డ్ పాలు, క్యాన్డ్ ఫుడ్స్ లో అత్యంత హానికరమైన రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి స్పెర్మ్ కౌంట్ ఉత్పత్తి రేటును తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. 

మనలో చాలా మంది పారాసెటమాల్ ను అధికంగా తీసుకుంటారు. ఈ మందు ప్రభావం వల్ల వీర్యకణాల ఉత్పత్తి కూడా తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. పారాసెటమాల్ అధికంగా తీసుకోవడం వల్ల మగవారి స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించే కొన్ని పదార్థాలు శరీరంలో పేరుకుపోవడానికి కారణం అవుతుందట.. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. దాని ప్రకారం మగవారు మాత్రమే కాదు.. గర్భిణీ స్త్రీలు కూడా పారాసెటమాల్ ని అధికంగా తీసుకోకూడదని సూచిస్తున్నారు. 

Leave a Comment