ఒక్కో నేరానికి ఒక్కో రేటు.. యూపీలో పోస్టర్ కలకలం..!

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అంటేనే రౌడీలకు అడ్డాగా చెప్పొచ్చు. అక్కడ పైసలిస్తే ఎంతటి దారుణానికైనా తెగబడతారు. అక్కడ ఓ గ్యాంగ్ ఏ నేరానికి ఎంత చార్జ్ చేస్తారో తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కిడ్నాప్, బెదిరించడం, హత్య చేయడం, కొట్టడం వంటి పనులు చేసి పెడతారు. వారు చేసే నేరాలకు డబ్బులు ఎంత అనే దానిని ముందుగానే నిర్ణయిస్తారు. ఏ క్రైంకి ఎంత చార్జ్ చేస్తారో వివరిస్తూ ఈ పోస్టర్ ను రూపొందించారు.

వారు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓ యువకుడు తుపాకీ పట్టుకుని ఉన్నాడు. ఇటు పక్క నేరాలకు ఎంత చార్జ్ చేస్తారో చార్ట్ ఉంది. బెదరించడానికి రూ.1000, కొట్టడానికి రూ.5000, గాయపరచడానికి రూ.10 వేలు, హత్యకు రూ.55,000 మాత్రమే వసూలు చేస్తామని, అవరమైన వాళ్లు ఫోన్ చేయాలని నెంబర్లు ఇచ్చారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రకటన ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.   

 

Leave a Comment