త్వరలో ఒకే డిజిటల్ కార్డు.. ముసాయిదా సిద్ధం చేసిన కేంద్రం..!

ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు ఇలా దేశంలో ఒక్కొక్కదానికి ఒక్కో కార్డు ఉంది. అయితే కేంద్రం ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తోంది.. అన్ని ఐడీ కార్డులు కలిపి ఒకే డిజిటల్ ఐడీ కార్డు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.. వచ్చే నెల 27లోపు దీనిపై ప్రజల అభిప్రాయాలను కోరనుంది కేంద్ర ప్రభుత్వం..

దేశంలో రకరకాల కార్డులు ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కార్డు ఉంది. దీంతో ఐడీ కార్డుల అప్ డేట్ అనేది క్లిష్టంగా మారుతోంది.. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, స్పెల్లింగ్ వంటి వివరాలు తప్పుగా పడినప్పుడు.. వాటిని సరిచేసుకునేందుకు సమస్యగా మారింది. దీంతో ఈ కార్డులన్నీంటిని అనుసంధానం చేస్తూ ఒకే డిజిటల్ ఐడీ కార్డు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.. అందుకోసం ‘ఆల్ ఇన్ వన్ డిజిటల్ కార్డు’ను కేంద్రం సిద్ధం చేస్తోంది..

ఈ ఐడీ సాయంతో అన్ని గుర్తింపు కార్డులను ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. వేర్వేరు గుర్తింపు కార్డులు ఒకే దగ్గర ఉండటం వల్ల ఏది అవసరమైతే దానిని పరిగణలోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అన్ని కార్డులను ప్రతి చోటుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. థర్డ్ పార్టీ సర్వీస్, ఈకేవైసీ కోసం కూడా ఈ డిజిటల్ ఐడీని ఉపయోగించుకోవచ్చని కేంద్రం ముసాయిదాలో పేర్కొంది.  

 

 

Leave a Comment