ఒమిక్రాన్ సోకిన వారు తీసుకోవాల్సిన ఆహారాలివే..!

కరోనా వైరస్ యొక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజు రోజుకి విపరితంగా ప్రపంచం మొత్తము విస్తరిస్తోంది. మూడోవేవ్‌లో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమయంలో, కరోనా సంక్రమణ వ్యాప్తి వలన, దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఇంకా చాలా చోట్లా రెస్టారెంట్లు, హోటళ్లలో మూసివేస్తున్నారు. దీంతో పాటు పని లేకుండా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, మీరు తినే ఆహారంపై శ్రద్ధ చూపించాలి. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటే, మీరు ఒమిక్రాన్ బారిన పడినప్పటికీ, సులభంగా కోలుకుంటారు. ఓమిక్రాన్ వేరియంట్ సమయంలో మీరు ఏయే వస్తువులను తీసుకోవాలి. ఏ వస్తువులకు దూరంగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాము.

నీరు మానవ శరీరానికి అతి ముఖ్యమైన పదార్థము.నీటిని రోజు బాగా త్రాగాలి. మంచి ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగటం చాలా అవసరము.బయట మార్కెట్లో దొరికే బాటిల్ వాటర్ తాగడం అంత మంచిది కాదు అని గుర్తుంచుకోండి. ఈ ఓమిక్రాన్ సందర్భంలో, మీరు నిమ్మరసం తీసుకోవడం మంచిది.అంతే కాకుండా శరీరంలో ఎప్పుడూ నీరు ఉండేలా జాగ్రత పడాలి. 

రోజుకు దాదాపు10 గ్లాసుల నీరు తాగాలి.లేకపోతే శరీరము సరిగా పనిచెయ్యదు.ఫైబర్ కలిగిన ఆహారము తీసుకోవడము వలన జీర్ణక్రియలో చాలా మెరుగు పడుతుంది. మరియు ఆకలిని తగ్గిస్తుంది, ఫైబర్ వీటిలో పుష్కలంగా దొరుకుతుంది అవి ఏమిటి అంటే కూరగాయలు, పండ్లు, పప్పులు మరియు తృణధాన్యాలు,ఇంకా గొడుములు.

ఉప్పు లేకుండా మనము రోజు ఏ వంట తినలేము.అలా అని ఎక్కువ ఉప్పు తీసుకోవడము ఆర్యోగానికి ప్రమాదం.అదనపు ఉప్పు అస్సలు కూరలో వేసుకోకండి.పసుపు కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండడము వల్ల గొంతు నొప్పి, గొంతు గరగర, దగ్గు వంటి తగ్గుతాయి తగ్గిస్తుంది.ప్రతి రోజు నిద్ర లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాసు నీటిలో పసుపు కలుపుకొని తగ్గితే ఎంతో ఉపయోగము.తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలము. దీంతో తేనె జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. అంతేకాదు గొంతు ఇబ్బందులకు చక్కటి పరిష్కరం తేనె. కనుక తేనెను రొజూ అల్లం టీ లేదా వేడి నీటిలో వేసుకుని తాగినా అద్భుత ఫలితం ఉంటుంది.

ఆల్కహాలకి, సిగరెట్లకి దూరంగా ఉండాలి.ఈ అలవాట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.ఇది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.ఈ ఓమిక్రాన్ సమయములో రోగ నిరోధక శక్తి అన్నిటికి కంటే ముఖ్యము.ఏ కాలములోను అయినా ఊసిరి మంచిది.ముఖ్యంగా చాలి కాలములో ఊసిరి ఉపయోగాలు అనేకము.ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.విటమిన్ సి ఆరోగ్యానికి మంచిది.ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.నెయ్యి ఆహారంలో తరచుగా వాడడటం వల్ల ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది.

 

Leave a Comment