‘ఒంటరిగా బతకలేకపోతున్నా.. నాకు పెళ్లి చేయండి’.. మంత్రి రోజాకు పెద్దాయన రిక్వెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ పర్యాటక మంత్రి రోజా తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలో పర్యాటించారు. పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అన్న విషయాలను రోజా తెలుసుకున్నారు. 

పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో పర్యటనలో మంత్రి రోజాకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ పెద్దాయన మంత్రి రోజాను వింత కోరిక కోరాడు. నెలవారీ పింఛన్ అందుతుందా? అన్న ప్రశ్నకు.. ఆ పెద్దాయన బదులివ్వకుండా.. ‘నేను ఒంటరిగా బతకలేకపోతున్నా.. నాకు తోడు ఎవరూ లేరు. నాకు ఎక్కడైనా పిల్లను చూసి పెళ్లి చేయండి’ అంటూ మంత్రి రోజా ఎదు మొరపెట్టుకున్నాడు.. 

ఆ పెద్దాయన కోరిక విన్న మంత్రి రోజా ఒక్కసారిగా అవాక్కై నవ్వేశారు. పింఛన్ అయితే ఇప్పించగలమని, కానీ పెళ్లి చేయడం తన పని కాదని మంత్రి రోజా పెద్దాయనతో అన్నారు. ఆ పెద్దాయన కోరిక విన్న అక్కడ ఉన్న వారంతా నవ్వుకుంటూ ముందుకు సాగారు..   

Leave a Comment