రాహుల్ లో ఆ లక్షణం లేదు..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బారక ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. బారక్ ఒబామా తన రాజకీయ అనుభవాలు, జీవిత జ్ఞాపకాలను ‘ఎ ప్రామిస్ట్ ల్యాండ్’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఒబామా రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 రాహుల్ గాంధీలో ఏదో తెలియని భయం ఉందని, ఒక క్లాస్ లో టీచర్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా ఆతృతగా ఉంటారని ఒబామా వ్యాఖ్యానించారు. అయితే ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకునే గుణం, పట్టుదల రాహుల్ గాంధీలో కనిపించవని  ఒబామా తన పుస్తకంలో రాశారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇంకా ఈ పుస్తకంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లపై కూడా ఆసక్తికర వ్యాఖ్యాలు చేసినట్లు టైమ్స్ తెలిపింది. అయితే భారత ప్రధాని మోడీ గురించి ఏం రాశారు అన్నది ఇంకా తెలియలేదు.  

 

Leave a Comment