ఖాళీ సిరంజితోనే టీకా వేసిన నర్సు.. వీడియో వైరల్

బీహార్ లోని చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో ఓ నర్సు ఖాళీ సిరంజితో వ్యాక్సిన్ వేసింది. దీంతో సీరియస్ అయిన వైద్యాధికారి నర్సును తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో ఓ వ్యక్తి వ్యాక్సిన్ వేసుకునేందుకు కుర్చీలో కూర్చున్నాడు. అక్కడ నర్సు ప్లాస్టిక్ కవర్ లో ఉన్న కొత్త సిరంజిని బయటకు తీసి.. దానిలో ఎలాంటి వ్యాక్సిన్ నింపకుండానే ఆ వ్యక్తికి ఇంజక్షన్ వేసింది. 

ఆమె వ్యాక్సిన్ వేస్తున్న ప్రక్రియను ఆ వ్యక్తి స్నేహితుడు తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. ఆ తర్వాత వీడియోను చూస్తే ఆమె ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్ వేసినట్లు తేలింది. దీంతో షాకైన సదరు వ్యక్తి నర్సు నిర్వాకంపై అక్కడే ఉన్న సూపరిండెంట్ కు ఫిర్యాదు చేశాడు. సూపరిండెంట్ విషయాన్ని వైద్యాధికారికి తెలపడంతో నర్సును విధుల నుంచి తొలగించారు.  అయితే ఖాళీ సిరంజితో వ్యాక్సిన్ వేయడంతో తనకు తల నొప్పి వచ్చిందని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో మరోసారి వ్యాక్సిన్ వేసుకోకుండానే వెళ్లిపోయాడు. 

 

Leave a Comment