అలవైకుంఠపురం సీన్ రిపీట్.. నర్స్ కన్ఫ్యూజన్ తో మారిన బిడ్డ.. మూడేళ్ల తర్వాత..!

అసోం రాష్ట్రంలో అలవైకుంఠపురంలో సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఆస్పత్రి జరిగిన తప్పిదం వల్ల ఓ తల్లి తన బిడ్డకు మూడేళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది.  ఈ ఘటన అసోంలోని బర్పెట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు ప్రసవించారు. 

ఇద్దరి మహిళల పేర్లు కూడా నజ్మా ఖానం అనే ఉండటం వల్ల ఆస్పత్రిలో నర్సు ఒకరి బిడ్డను మరొకరికి అందించింది. అయితే ఇద్దరు శిశువుల్లో ఒకరు చనిపోవడంతో ఆ తల్లి ఎంతో బాధపడింది. దీనిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చంది. దీంతో వీరు అడ్వకేట్ ని కలిసి తమ అనుమానాలను ఆయనతో చెప్పుకున్నారు.

దీంతో అడ్వకేట్ అబ్దుల్ మన్నన్ ఆ ఆస్పత్రిలో అదే తేదీన ప్రసవించిన మహిళల పేర్లు అన్నీ పరిశీలించారు. ఆ సమయంలో నజ్మా ఖానం పేరుతో మరో మహిళ ఉన్నట్లు గుర్తించారు. అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పేర్లు ఒకేవిధంగా ఉండటం వల్ల నర్స్ పొరపాటు పడి ఇలా చేసి ఉండొవచ్చని అనుమానించారు. 

అప్పటికే నజ్మా ఖానం కుటుంబ సభ్యులు దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. డీఎన్ఏ పరీక్ష చేస్తే తప్ప పరిష్కారం దొరకదని భావించి.. డీఎన్ఏ టెస్ట్ చేశారు. డీఎన్ఏ రిపోర్ట్ లో బిడ్డ ఫిర్యాదు చేసిన నజ్మా ఖానం బిడ్డే అని తేలింది. దీంతో బిడ్డను నజ్మా ఖానంకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇదంతా పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. మూడేళ్ల తర్వాత ఆ తల్లి తన బిడ్డను కలుసుకుంది.  

Leave a Comment