‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాక.. ‘భీమ్’ రియాక్షన్ ఎలా ఉందో చూడండి..!

అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన.. కెరీర్ లో అపజయం ఎరుగని దర్శకుడు తెరకెక్కించిన RRR సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భారీ అంచనాలతో ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు విడుదల అయ్యింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరోలు వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 

కాగా.. RRR సినిమా విడుదలైన సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ థియేటర్ కి వెళ్లి సందడి చేశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు.. రామ్ చరణ్, రాజమౌళి భ్రమరాంబ థియేటర్ లో అభిమానులతో కలిసి సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ బయటకు వస్తూ సినిమా అద్భుతంగా ఉందంటూ సంజ్ఞ చేశాడు. సినిమా సూపర్ హిట్ అంటూ సంకేతాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

 

Leave a Comment