ఎన్పీఆర్ నిరవధిక వాయిదా..

కరోనా ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలు ప్రభావితమయ్యయి. దీని ప్రభావం జనాభా లెక్కల సేకరణపై కూడా పడింది. కరోనా నేపథ్యంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణను కేంద్ర హొం శాఖ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో పాటు ఎన్పీఆర్ ను కూడా కేంద్రం నిరవధికంగా వాయిదా వేసింది. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ లు దేశంలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. బీజేపీ ప్రభుత్వంపై పలు విపక్షాలు విరుచుకుపడ్డాయి. 

అయితే కొన్ని రాష్ట్రాలు ఎన్పీఆర్ ను అమలు చేయబోమని స్పష్టం చేశాయి. అదే సమయంలో జనాభా లెక్కల సేకరణ తొలిదశకు షెడ్యూల్ ను కేంద్రం ప్రకటించింది. దీనిపై కూడా పలు రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. 

ఈ వివాదం కొనసాగుతుండగానే కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రపంచంలోని 166 దేశాల్లో కరోనా వైరస్ విస్తరించింది. మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంలో పడేసింది. వైరస్ కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. ప్రజల్లో వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే జనాభా లెక్కల సేకరణ వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

జనాభా లెక్కల సేకరణ తొలిదశతో పాటు ఎన్పీఆర్ అమలును కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. తిరిగి ఎప్పడు ప్రారంభించేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాతనే జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

Leave a Comment