‘హలో కాదు.. వందేమాతరం అనండి’

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.. ఈసందర్భంగా ఆదివారం తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించారు.. పోర్ట్ ఫోలియోలను అప్పగించిన కొద్ది సేపటికే మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. 

మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారులు, కార్మికులు తమ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హలో అని కాకుండా వందేమాతరం అని సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. హలో అనేది ఇంగ్లీస్ పదమని, అందుకే దానిని వదులుకోవాలని సూచించారు. వందేమాతరం కేవలం పదం కాదని, ప్రతి భారతీయుడు అనుభవించే ఒక అనుభూతి అని పేర్కొన్నారు. అందుకే అధికారులు హలో అని కాకుండా ఫోన్ లో ‘వందేమాతరం’ అని చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయని స్పష్టం చేశారు. 

Leave a Comment