మా పార్టీలో చేరింది మిడతల దండు కాదు..రామదండు : బీజేపీ

కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. అనంతపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం సమాచార సేకరణలో జర్నలిస్టులు కోవిడ్ బారిన పడ్డారన్నారు. వారికి తక్షణ సహాయంగా ఒక్కోక్కరికి రూ.లక్ష ఇచ్చి ఆదుకోవవాలన్నారు. 

కరోనా కాలంలో వలస కార్మికులకు, స్ట్రీట్ వెండర్స్ కు ఉద్దీపన పథకాలను ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇక ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసేందుకు వినిగించిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కట్టే పరిస్థితి లేదన్నారు. చేసిన పని కంటే ప్రచారానికే ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నారన్నారు. 

ఇటీవల బీజేపీ ఎంపీ విజయసాయిరెడ్డి మిడతల దండు బీజేపీలో చేరుతున్నారని చెప్పిన మాటలకు ఆయన స్పందించారు.  బీజేపీలో చేరింది మిడతల దండుకాదు..రామదండు అని కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో ఉన్న వారంతా కాంగ్రెస్ బురద గుంట నుంచి వచ్చిన వారే..ఎవరికీ సిద్ధాంతాలు లేవన్నారు. వైసీపీ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయే పరిస్థితి ఉందని, వారికి కాపాడుకోవాలని చెప్పారు.  

Leave a Comment