Video Viral: బటన్ నొక్కగానే.. కేవలం 9 సెకన్లలో కుప్పకూలిన ట్విన్ టవర్స్

నిబంధనలకు విరద్ధంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ ని అధికారులు కూల్చివేశారు. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ ఆదివారం ఈ జంట భవనాలను కూల్చివేసింది. అయితే పక్క భవనాలకు నష్టం కలగకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఒక్క బటన్ నొక్కగానే 100 మీటర్లకుపైగా పొడవైన ఈ టవర్స్ పేకమేడల్లా కుప్పకూలాయి.. 

ఈ టవర్స్ ని కూల్చేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఇక ఈ నిర్మాణం కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చు అయితే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిర్మాణా విలువ రూ.1200 కోట్లు ఉంటుంది. ఈ కూల్చివేత నేపథ్యంలో స్థానికులకు తాత్కాలికంగా ఖాళీ చేయించారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. 

ఈ కూల్చివేతతో 55 వేల టన్నుల వ్యర్థాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటి తొలగింపునకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని రోజుల పాటు దుమ్ము వల్ల ప్రజలు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అందుకే అందరూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ ట్విట్ టవర్స్ ఎలా కూలుతున్నాయో మీరూ చూడండి.. 

 

Leave a Comment