‘పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు.. కరెంట్ లేదు’.. వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..!

హైదరాబాద్ లో శుక్రవారం క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షోను శుక్రవారం తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు పక్క రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లాడు. తిరిగి హైదరాబాద్ వచ్చాన నాకు ఫోన్ చేశాడు. అక్కడ నాలుగు రోజులు ఉంటే కరెంట్ లేదు. నీళ్లు లేవు, రహదారులు ధ్వంసమై ఉన్నాయి. అన్యాయంగా, అధ్వానంగా ఉన్నాయి. తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది. మీ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి ప్రజలను పక్క రాష్ట్రానికి పంపించండి.. మన ప్రభుత్వం విలువ, అభివృద్ధి ఎంటో తెలుస్తుందని ఆ స్నేహితుడు చెప్పాడు’ అని కేటీఆర్ అన్నారు.. 

మంత్రి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాంగా దుమారం చెలరేగింది. ఏపీ మంత్రులు, నేతలు కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని, అసలు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆంధ్రావారే అని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.. ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ.. ఓట్ల కోసమే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. మంత్రులు బొత్స, జోగి రమేష్ తదితరులు కూడా వరుసగా కౌంటర్స్ ఇచ్చారు. 

 ఈనేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఒక సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు బాధ కలిగించినట్లుంది. ఏపీ సీఎం జగన్ తో నేను సోదర సమాన అనుబంధాన్ని ఆస్వాదిస్తా. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పురోగమించాలని కోరుకుంటున్నా’. అంటూ ట్వీట్ చేశారు.  

 

 

Leave a Comment