వ్యాయామానికి టైమ్ లేదా ? అయితే ఇలా చేయండి..

ఉద్యోగం, వ్యాపార రీత్యా బిజీగా ఉండే వారి జీవితాలు నిత్యం ఉరుకులు పరుగులతోనే ఏళ్లు గడిచిపోతుంటాయి. ఇంత బిజీ జీవితంలో ఇక వ్యాయామానికి సమయం ఎక్కడిది అనేది చాలా మంది నోట వచ్చే సర్వసాధారణమైన సమాధానం. కానీ మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా..కొద్దిగా మనసు పెడితే ..2 నిమిషాల్లోనే శరీరం మొత్తానికి మేలు చేసే వ్యాయామాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితుల్లో కనీసం రెండు నిమిషాలైనా వ్యాయామానికి కేటాయిస్తే మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

తక్కువ సమయంలో ఎక్కువ మేలు చేసే ఎక్సర్ సైజ్ లు ఏమైనా ఉన్నాయా అంటే అందులో పుషప్స్ ముందు వరుసలో ఉంటాయనేది నిపుణుల సలహా. కేవలం రెండు నిమిషాల సమయం కేటాయించి సరైన పద్ధతిలో పుషప్స్ చేస్తే..శరీరానికి పూర్తి స్థాయి వ్యాయమం చేసినంత మేలు కలుగుతుందంటున్నరు వ్యాయామ నిపుణులు. పుషప్స్ తో పాదాల నుంచి తల వరకు మొత్తం శరీరంలోని ప్రతి అవయవాన్నీ ప్రభావితం చేసే శక్తి పుషప్స్ కు ఉందని ఓ అధ్యయనంలో తేలింది.పుషప్స్ తో గుండె రక్తనాళాలు ఉత్తేజితమవడంతో పాటు చేతులు, కాళ్లు, నడుం కింద వెనుక భాగంలో కండరాలు ధ్రుడంగా తయారవుతాయని, అలాగే మంచి శరీర సౌష్టవం ఏర్పడుతుందనేది నిపుణుల సలహా.

రోజూ రెండు నిమిషాలు వెచ్చించి పురుషులైతే 40, స్త్రీలు అయితే 20 పుషప్స్ చేస్తే చాలు, నిత్యం క్రమం తప్పకుండా 10 పుషప్స్ చేసే 40 ఏళ్ల వయసు వాళ్లనూ పరిశీలించగా,..ఇతరులతో పోలిస్తే, వారిలో గుండె పని తీరు బాగున్నట్టు గుర్తించారు. ఇక అదే సమయంలో రోజుకు 40కి మించి పుషప్స్ చేసే వారిలో 96 శాతం మందికి అసలు గుండె సమస్యలే తలెత్తదని నిపుణుల పరిశీలనలో తేలింది. మరి ఇంకేం..ఆరోగ్యానికి ఆరోగ్యం..మంచి శరీరాక్రుతినిచ్చే పుషప్స్ కోసం ఓ రెండు నిమిషాలైనా వెచ్చించగలరేమో ఒకసారి ఆలోచించండి..

You might also like
Leave A Reply

Your email address will not be published.