కరోనా ఎఫెక్ట్ : Infosys లో నియామకాలు రద్దు

కరోనా ఎఫెక్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీలను వదల్లేదు. తాజాగా సాఫ్ట్ వేర్ దిగ్గజం Infosys కూడా ప్రభావితమైంది. Infosys సంస్థలో కొత్త నియామకాలకు పాతర వేసింది. పదోన్నతులు, జీతాల పెంపు ఇప్పట్లో ఉండవని ప్రకటించింది. 

Infosys కంపెనీ నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా Infosys చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ మాట్లాడుతూ తాత్కాలికంగా కొత్త నియామకాలను రద్దు చేస్తున్నామన్నారు. జీతాల పెంపు కూడా ఉండదని, ప్రమోషన్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. 

ఇప్పటి వరకు కొత్తగా తీసుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని Infosys చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీన్ రావ్ తెలిపారు. కరోనా కారణంగా Infosys నుంచి ఒక్క ఉద్యోగిని కూడా తాము తొలగించలేదని స్పష్టం చేశారు. ఇప్పట్లో సంస్థలు తెరవబోమని, వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తామని చెప్పారు. అయితే కరోనా వైరస్ తగ్గాక క్రమంగా ఉద్యోగులను పెంచుతామని పేర్కొన్నారు. 

 

Leave a Comment