డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక టెస్ట్ అవసరం లేదు..!

గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ లో శిక్షణ పొందితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించే టెస్ట్ కు మినహాయింపు ఇస్తున్నారు. రోడ్డు, రవాణ మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు జూలై 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన మేరకు గుర్తింపు పొంది డ్రైవింగ్ సూల్ లో అభ్యర్థులు ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటారో వారికి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ జారీ చేస్తారు. 

జూలై 1, 2021 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుంచి శిక్షణ తీసుకోవాలి. ఇలా గుర్తించబడిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుంచి శిక్షణ పూర్తి చేసిన తర్వాత, శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. వాటిని ఆర్టీయే కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుతో జతచేస్తే సరిపోతుంది. ఎలాంటి టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ నేరుగా పొందవచ్చు. 

డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో ఉండాల్సిన పీచర్స్:

  • అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడానికి డ్రైవింగ్ స్కూల్ లో సిమ్యులేటర్లను సమకూర్చుకోవడం, కనీసం ఎకరా స్థలానికి తగ్గకుండా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం వంటి మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. 
  • మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాల్లో రెమెడియల్, రిఫ్రెషర్ కోర్సులు పొందవచ్చు. 
  • ఈ కేంద్రాల్లో విజవంతంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు డ్రైవింగ్ పరీక్ష అవసరం నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ పరీక్షను ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ) నిర్వహిస్తుంది. 
  • ఈ కేంద్రాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట శిక్షణ ఇవ్వడానికి కూడా అనుమతించబడతాయి. 

Leave a Comment