థర్డ్ వేవ్‌ వస్తుందన్న ఆధారాల్లేవు : ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్

కరోనా థర్డ్ వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ వేవ్ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సెకండ్ వేవ్ లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని చెప్పారు. 

చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు:

మరో వైపు ఇదే అంశంపై కోవిడ్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడు, నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ క్లారిటీ ఇచ్చారు. ఏ వేవ్ కూడా ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కరోనా పెద్దల్లోనూ, పిల్లల్లోనూ ఒకే రకమైన ప్రభావం చూపిందని గుర్తు చేశారు. 

Leave a Comment