ఏపీలో కోవిడ్ ఆంక్షలు.. నైట్ కర్ఫ్యూ.. మాస్క్ ధరించకపోతే జరిమానా..!

ఆంధప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాజాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కోవిడ్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భాంగా కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సి చర్యలపై చర్చించారు. సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని, మాస్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  

కోవిడ్ నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్ లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్ లు ధరించకపోతే జరిమానాలు కొనసాగించాలని ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్ డోర్స్ లో 100 మంది మించకుండా చూడాలని, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కరోనా ఆంక్షలు పాటించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. 

 

 

Leave a Comment