ఓ ప్రాణం కాపాడేందుకు.. పెళ్లి బట్టల్లో రక్తదానం..!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఓ వేడుక.. అలాంటి రోజున ఈ కొత్త జంట చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి. పెళ్లి బట్టల్లోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉన్న ఓ యువతికి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపిన ఈ జంట  పలువురికి ఆదర్శంగా నిలిచింది. 

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువతికి ఆపరేషన్ కోసం అత్యవసరంగా రక్తం అవసరమైంది. అయితే రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న నూతన వధూవరులు ముందుకు వచ్చారు. నేరుగా పెళ్లి పందిరి నుంచి పెళ్లి బట్టలతో ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేసి ఆ యువతి ప్రాణాలు కాపాడారు. ఈ విషయాన్ని యూపీ పోలీస్ ఉన్నతాధికారి ఆశిష్ మిశ్రా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొత్త జంటపై ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా వారిద్దరిని ప్రశంసించారు. 

Leave a Comment